విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో నల్లరాయి క్వారీ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ గిరిజనులు ఆందోళన చేపట్టారు. హుకుంపేట మండలం కొట్టనాపల్లి పంచాయతీలో నల్లరాయి క్వారీ ఏర్పాటుచేసేందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మంగళవారం దీనిపై గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. క్వారీ నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మానించుకున్నారు. అందరూ దీనిని కట్టుబడి ఉండాలని మాజీ సర్పంచ్ వాసుదేవ పేర్కొన్నారు.
ఇదీ చదవండి