ETV Bharat / state

విశాఖలో విద్యార్థుల వినూత్న కార్యక్రమం... ఎందుకో తెలుసా..?

author img

By

Published : Nov 2, 2019, 8:33 PM IST

పుస్తకాలు చేత పట్టుకుని కళాశాలలకు వెళ్లాల్సిన ఆ కుర్రాళ్లు... ప్రజాసేవలో మేము సైతం అంటూ... ముందుకొచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి కుటుంబాలను చూసి చలించిన ఆ విద్యార్థులు... తమ వంతు సహాయం చేయాలనుకున్నారు. చేతిలో పుస్తకాలకు బదులు... ప్లకార్డులు పట్టుకున్నారు. వాహనచోదకులారా... మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తోందంటూ... అవగాహన కల్పిస్తున్నారు విశాఖ వర్ణిక హోటల్ మేనేజ్​మెంట్ విద్యార్థులు.

Traffic Rules Awareness rally in Visakhapatnam
విశాఖలో విద్యార్థుల వినూత్న కార్యక్రమం

రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలతో... ప్రమాదాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. విశాఖ వంటి నగరాల్లో మరీ ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రహదారి ప్రమాదాల బారినపడ్డ కుటుంబాల పరిస్థితి చూసి చలించిన... వర్ణిక హోటల్ మేనేజ్​మెంట్ విద్యార్థులు... ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయి... నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో... తెలిపే ప్లకార్డులు ప్రదర్శించారు.

సెల్​ఫోన్​ మాట్లాడుతూ, మద్యం సేవించి, హెల్మెంట్, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడపొద్దని చోదకులకు అవగాహణ కల్పించారు. పువ్వులు చాక్లెట్లు అందించారు. జాగ్రత్తగా నడపకపోతే జరిగే ప్రమాదాల వల్ల... అనేక కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తోందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ... ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: గుంటూరులో ట్రాఫిక్ సమస్యకు పోలీసుల చర్యలు

Intro:పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన ఆ చేతులు ప్రజా సేవలో మేము సైతం అంటూ రోడ్డు ఎక్కాయి రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు సాయం అందించేందుకు ఆ విద్యార్థులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం

Body:రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి విశాఖ వంటి నగరాల్లో ఈ ప్రమాదాలు మరింత ఎక్కువగా జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఓ కళాశాల విద్యార్థులు విశాఖలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు నగరంలోని వర్ణిక హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు మద్దిలపాలెం కూడలిలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు రోడ్డు ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి వాటిని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపే ప్లకార్డులు ప్రదర్శించి వాహన చోదకులకు అవగాహన కల్పించారు వాహనం నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడరాదు మద్యం సేవించి వాహనాలు నడపరాదు హెల్మెట్ సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడపరాదు అని వాహన చోదకులకు తెలియజేస్తూ వారికి పువ్వులు చాక్లెట్లు ఇచ్చి అవగాహన కల్పించారు వాహనాలు జాగ్రత్తగా నడపక పోతే జరిగే ప్రమాదాల వల్ల మన కుటుంబంతో పాటు అనేక కుటుంబాలు బాధ పడాల్సి వస్తోందని తెలియజేశారు వీటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేశారు
---------
బైట్ పద్మ అధ్యాపకురాలు వర్ణిక మేనేజ్మెంట్ కళాశాల విశాఖ
బైట్ శివాని వర్ణిక మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థి విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.