విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటి ముట్టడికి యత్నించిన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ ద్వారా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా నిర్వహించిన సభలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును రక్షించాలని, ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు సహాయం అందించాలని కోరారు. కార్మిక శాఖ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి