ఎన్నో ఉద్యమాల అనంతరం రాష్ట్రంలోని విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌కు రైల్వేజోన్ కేటాయించడం జరిగిందని...ఇప్పుడు దాన్ని రద్దు చేస్తామని మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించడం ఆందోళనకరమని ట్రేడ్ యూనియన్ నాయకులు మండిపడ్డారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాల నేతలను, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల మద్దతుతో కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలుస్తామని తెలిపారు. ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.
ఇది చూడండి: ల్యాండ్ టైటిల్ యాక్టుకు గ్రీన్ సిగ్నల్