విశాఖ జిల్లా మద్దిలపాలెంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ క్యాంపస్ ముఖద్వారం వద్ద నూతన గడియారాన్ని(టవర్ క్లాక్) ఏర్పాటుచేశారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు ఈ అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పీవీజీ ప్రసాద్ రెడ్డి ఈ గడియారాన్ని ప్రారంభించారు. విశాఖలో అత్యంత రద్దీగా ఉండే మద్దిలపాలెం కూడలిలో... ప్రజలకు ఈ గడియారం ఇక నుంచి సమయాన్ని తెలుపుతూ సేవలు అందించనుంది. వందలాది మంది విద్యార్థులకు విద్యనందిస్తున్న ఆంధ్ర విశ్వకళాపరిషత్ సమయపాలనకు స్ఫూర్తిగా ఈ గడియారాన్ని ఏర్పాటు చేసినట్టు ఉపకులపతి తెలిపారు.
ఏయూ ఇంజినీరింగ్ క్యాంపస్ ముఖద్వారంపై అతి పెద్ద గడియారం - tower clock installation at andhra university news
విశాఖ మద్దిలపాలెంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ క్యాంపస్ ముఖద్వారం వద్ద నూతన గడియారాన్ని(టవర్ క్లాక్) రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పీవీజీ ప్రసాద్ రెడ్డి ఈ గడియారాన్ని ప్రారంభించారు.
విశాఖ జిల్లా మద్దిలపాలెంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ క్యాంపస్ ముఖద్వారం వద్ద నూతన గడియారాన్ని(టవర్ క్లాక్) ఏర్పాటుచేశారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు ఈ అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పీవీజీ ప్రసాద్ రెడ్డి ఈ గడియారాన్ని ప్రారంభించారు. విశాఖలో అత్యంత రద్దీగా ఉండే మద్దిలపాలెం కూడలిలో... ప్రజలకు ఈ గడియారం ఇక నుంచి సమయాన్ని తెలుపుతూ సేవలు అందించనుంది. వందలాది మంది విద్యార్థులకు విద్యనందిస్తున్న ఆంధ్ర విశ్వకళాపరిషత్ సమయపాలనకు స్ఫూర్తిగా ఈ గడియారాన్ని ఏర్పాటు చేసినట్టు ఉపకులపతి తెలిపారు.
ఇదీ చదవండి: చిన్నారులకు స్నాతకోత్సవ వేడుక.. ఆకట్టుకున్న నృత్యాలు