PIL: విశాఖ జిల్లా ఎండాడ గ్రామం సాగరిక టౌన్‌షిప్ పరిధిలో 22,264 చదరపు గజాల ఓపెన్ ప్లాట్లను ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ మే 5న ప్రకటనను జారీ చేసింది. తాజాగా ఈ ప్రకటనను సవాలు చేస్తూ విశాఖ తూర్పు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. రాజీవ్ స్వగృహ పథకం ఉద్దేశాలకు విరుద్ధంగా కార్పొరేషన్ వ్యవహరిస్తోందని, వేలం ప్రకటనను రద్దు చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు అందుబాటు ధరల్లో ఉంచేలా, పథకాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ, వేలం నిర్వహించనున్న సంస్థ ఎంఎస్‌టీఎస్ ఎండీని ప్రతివాదులుగా పేర్కొన్నారు. సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.
ఇవీ చదవండి: