నాలుగు నెలలుగా బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్న విశాఖ మత్స్యకారులు రేపు విడుదల కానున్నారు. గతేడాది అక్టోబర్ 2న విశాఖ నుంచి 8 మంది మత్స్యకారులు వేటకు బయలుదేరారు. బోట్ రిపేర్ రావడంతో బంగ్లాదేశ్ తీరంలోకి పొరపాటున వెళ్ళిపోయారు. బంగ్లా ప్రభుత్వం అక్రమ చొరబాటు కేసు కింద వారందరిని అదుపులోకి తీసుకుంది. రాష్ట్ర మత్స్యకార యువజన సమాఖ్య ప్రతినిధి వాసుపల్లి జానకిరామ్ చొరవ తీసుకొని ప్రభుత్వానికి విన్నవించారు. స్పందించిన ప్రభుత్వం వెంటనే వారిని విడిపించే చర్యలు చేపట్టింది. బుధవారం తమవారు విడుదల కానున్నారన్న విషయం తెలుసుకున్న మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెప్పారు.
ఇదీ చదవండి: