విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ పెదబయలు మండలం గలగండ సమీపంలో రహదారిపై టిప్పర్ బోల్తా పడింది. రోడ్డు పక్కన ఉన్న లోయలోకి లారీ బోల్తా పడడంతో డ్రైవర్ అందులో చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న వాహనచోదకులు.. లారీ అద్దాలు పగులకొట్టి డ్రైవర్ను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గలగండ సమీపంలో రహదారులు పనుల నిమిత్తం గంపరాయి నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీచూడండి: పాలకొల్లులో రక్తపుధార.. అద్దె అడిగినందుకు దారుణ హత్య