ముగ్గురు దొంగల అరెస్టు.. బంగారం, వెండి స్వాధీనం - విశాఖలో వరుస చోరీలు
విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ నిందితులను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇప్పటివరకూ 45 ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరి నుంచి 2,700 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడు బోద్దపు బాబురావు హత్యకు గురయ్యాడు. ప్రధాన నిందితుడు హత్యకు గురవ్వటంతో పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టలేకపోయామని అదనపు ఎస్పీ అచ్యుతరావు తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు.
Intro:Ap_vsp_46_11_vo_mudu_jillallo_chori_nidirula_arest_ab_AP10077_k.Bhanojirao_8008574722 విశాఖ విజయనగరం తూర్పుగోదావరి జిల్లాలలో చోరీలకు పాల్పడ్డ నిందితులను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు 45 ఇళ్లలో నిందితులు చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు అగనం పూడి చెందిన తాటిపూడి శంకర్ సబ్బవరం కి చెందిన శెట్టి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి గ్రామానికి చెందిన శెట్టి ప్రసాద్ లను అరెస్టు చేసినట్లు విశాఖ జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్)అచ్యుత రావు తెలిపారు
Body:నిందితులు ముగ్గురు 3 జిల్లాలోని 45 ఇళ్లల్లో చోరీలు చేశారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడు బోద్దపు బాబురావు హత్యకు గురయ్యాడు పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు నిందితులు విశాఖ జిల్లాలోని అనకాపల్లి పట్టణం గ్రామీణ ప్రాంతాలతో పాటు మునగపాక అచ్యుతాపురం ఎలమంచిలి మాకవరపాలెం కె.కోటపాడు కోడూరు నక్కపల్లి ఎస్ రా యవరం కోటవురట్ల ప్రాంతాల్లోని ఇళ్ళలో చోరీ చేశారు దీంతోపాటు విజయనగరం తూర్పుగోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడ్డారు నిందితులను అరెస్ట్ చేసి వీరి నుంచి 2,700 గ్రాముల బంగారు వస్తువులు 7 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు చోరీ కేసులో ఎనిమిదిన్నర కేజీల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా ప్రధాన నిందితుడు బొద్దపు బాబురావు హత్యకు గురవడంతో. పూర్తిస్థాయిలో రికవరీ చేయలేకపోయామని అదనపు ఎస్పీ తెలిపారు పూర్తిస్థాయిలో రికవరీ చేసేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు
Conclusion:బైట్1 అచ్యుతరావు విశాఖ జిల్లా అదనపు ఎస్పీ( క్రైమ్)