ETV Bharat / state

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

author img

By

Published : May 26, 2020, 9:20 AM IST

Three killed in different road accidents in andhrapradhesh
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం బీ.ఎస్.పేటకు చెందిన ఆదాడ శివ విశాఖ డైరీలో పనిచేస్తున్నాడు. పని ముగించుకొని ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా.. అనకాపల్లిలో జాతీయ రహదారిపై ఉన్న విభాగినిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శివ తలకు బలమైన గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన హుస్సేన్ బాషా.. రంజాన్ ప్రార్థనలు ముగించుకొని తన స్నేహితుడు జమాల్ వలీతో కలిసి ఆళ్లగడ్డకు ద్విచక్ర వాహనంలో బయల్దేరాడు. మార్గమధ్యంలో మర్రిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో హుస్సేన్ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు.

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస-తోటపల్లి మలుపు వద్ద లారీ-ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడిమికెల్ల గ్రామానికి చెందిన అరుణ్ కుమార్, అనిల్ కుమార్, పవన్ కుమార్​లు ద్విచక్రవాహనంపై గిజిబా గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో అరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్ కుమార్, పవన్ కుమార్​లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.