విశాఖలో చెదురుమదురు ఘటనలు మినహా ..అన్ని ప్రాంతాలలో మూడోదశ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై...ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- గూడెంకొత్తవీధి పంచాయతీలో సిబ్బంది తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
- మావోయిస్టు ప్రాబల్య గ్రామాల్లో కేంద్ర బలగాల బందోబస్తు కనిపించింది ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. అప్పటికే పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిశాయి.
- డుంబ్రిగుడలో పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటర్లు బారులుదీరారు. చంటిపిల్లలతో తల్లులు ఓటేసేందుకు వచ్చారు.
- ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు పోలింగ్ కేంద్రం ఉదయం 10.30 గంటల వరకు ఓటర్లు రాక ఖాళీగా కనిపించింది.
- ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాడేరులో, అరకు ఎంపీ మాధవి కొయ్యూరు మండలం వెలగలపాలెంలో, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు గూడెంకొత్తవీధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- పాడేరు మండలం చింతలవీధి పాఠశాలకు చెందిన రెండు గదుల్లో 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఏ వార్డు ఓటర్లు ఎక్కడ ఓటేయాలో తెలియక గందరగోళానికి గురయ్యారు.
- పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీలో ఓటరు కార్డులున్నా.. జాబితాలో పేర్లు లేవని ముగ్గురిని తిప్పి పంపారు.
- ముంచంగిపుట్టు మండలం బుంగాపుట్టు పంచాయతీ గరం ఘాట్‌రోడ్డులో కల్వర్టు వద్ద వాహనం కూరుకుపోయి ఏడు గ్రామాలకు చెందిన ఓటర్లు లక్ష్మీపురం పోలింగ్ కేంద్రానికి చేరుకోలేక ఉండిపోయారు.
- ముంచంగిపుట్టు మండలం కిలగాడ పంచాయతీ పోలింగ్ కేంద్రానికి 20 మంది ఓటర్లు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే సమయం మించిపోవడంతో ఓటు వేయలేకపోయారు. బీ పాడేరు మండలం వంట్లమామిడి పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వినయ్‌చంద్, ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ మధ్యాహ్నం 12.30 గంటలకు పరిశీలించారు.
ఓటోత్సాహం..
- అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీలో ఉదయం 6 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. ఇక్కడ 6.45 నిమిషాలకు పోలింగ్ మొదలయింది. ఓటర్లను పరిశీలించి పోలింగ్ కేంద్రాల్లోకి పంపించాల్సిన వైద్య, ఆరోగ్య సిబ్బంది 7.10 గంటలకు వచ్చారు.
- గిరిజనుల్లో కొంతమందికి ఓటు వేయడం తెలియక పోలింగ్ సిబ్బంది మడతపెట్టి ఇచ్చిన బ్యాలెట్‌ను అలాగే బాక్స్‌లో వేయబోయారు. గమనించిన పోలింగ్ సిబ్బంది వారికి ఓటు ఎలా వేయాలో వివరించి బ్యాలెట్ బాక్స్‌లో వేయించారు.
- కాశీపట్నం, హుకుంపేట, అనంతగిరి మండల కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో వాలంటీర్లు కొందరు అభ్యర్థులకు ఓటేయమని చెప్పడం కనిపించింది. వీరు ఓటర్లపై ఒత్తిడి తేవడం కనిపించింది.
- సుంకరిమెట్ట పోలింగ్ కేంద్రంలో నాలుగు బూత్‌లు టెంట్‌ల నీడలోనే ఏర్పాటు చేశారు. పోలీసుల పిలుపు మేరకు స్థానిక యువత ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లగా విధుల్లో సాయం అందించారు.
విజేతలు వీరే..
పాడేరు 26
జి.నీలకంఠం (గబ్బంగి), బి.చిట్టిబాబు (బర్సింగి), కె.మంగమ్మ (మోదపల్లి), ఎస్.రాంబాబు (డి.గొందూరు), ఎస్.లక్ష్మణరావు (బడిమెల), ఎస్.బాబూరావుపడాల్ (గుత్తులపుట్టు), వి.రాజుబాబు (కించూరు), టి.సూర్యకాంతం (తుంపాడ), పి.రుజమ్మ (గొండెలి), కె.శ్రీలక్ష్మి (కిండంగి), ఎల్.పార్వతమ్మ (లగిశపల్లి), జి.అశ్విజ (ఇరాడపల్లి), కె.సన్నిబాబు (డోకులూరు), వి.బసవన్నదొర (కాడెలి), ఎం.రమణమ్మ (వంతాడపల్లి), పి.రాంబాబు (వంట్లమామిడి), జి.చిట్టిబాబు (కుజ్జెలి), జి.అప్పలకొండ (సలుగు), ఎల్. చిట్టమ్మ (మినుములూరు), వి.బొంజుబాబు (వంజంగి), కె.ఈశ్వరమ్మ (జి.ముంచంగిపుట్టు), ఎం.మీనా (వనుగుపల్లి), కె.పరమేశ్వరి (దేవాపురం), వి.సీతమ్మ (చింతలవీధి), జి.బిమలమ్మ(ఐనాడ)
నాలుగు ఓట్లతో గెలుపు
మేజరు పంచాయతీ పాడేరు సర్పంచిగా కొట్టగుళ్లి ఉషారాణి నాలుగు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈమెకు 886, దన్నేటి పలాసి లక్ష్మికి 882 ఓట్లు వచ్చాయి.
చింతపల్లి 17
పుష్పలత (చింతపల్లి), ఎస్.వరలక్ష్మి (గొందిపాకలు), కె.రమేష్ (బలపం), జి.రమణమ్మ (కిటుముల), సీహెచ్. సునీల్‌కుమార్ (లోతుగెడ్డ), ఎస్.లక్ష్మయ్య (తమ్మంగుల), కె.లలిత (చౌడుపల్లి), పి.సన్యాసిరావు (అన్నవరం), బి.సన్యాసమ్మ (బెన్నవరం), పి.లక్ష్మి (కొమ్మంగి), వి.సోమరత్నం (కొత్తపాలెం), బి.కాంతమ్మ (కుడుముసారి), కె.శాంతకుమారి (లంబసింగి), ఎస్.గోపాల్ (పెదబరడ), పి.రాజుబాబు (ఎ.శనివారం), వి.మహేశ్వరి (తాజంగి), ఎల్.పండయ్య (ఎర్రబొమ్మలు)
అరకులోయ 14
పి.సుస్మిత (పద్మాపురం), జి.కళావతి (లోతేరు), పి.జ్యోతి (మాడగడ), బి.ఉపేంద్ర (చినలబుడు), వి.శ్రీను (మాదల), పి.రమేష్ (బస్కి), కె.సుభద్ర (చొంపి), డి.భాస్కర్ (బొండాం), జె.కాంతమ్మ (సిరగాం), ఎం.బుట్కి (ఇరగాయి), బి.బొజ్జ (గన్నెల), జి.చినబాబు (సుంకరమెట్ట), కె.రాధిక (కొత్తభల్లుగుడ).
జి.మాడుగుల 17
బి.ముత్యాలమ్మ (కిల్లంకోట), పి.కృష్ణమూర్తి (కుంబిడిసింగి), ఎస్.రామకృష్ణ (పాలమామిడి), టి.సూరిబాబు (నుర్మతి), కె.సుబ్బలక్ష్మి (పెదలువ్వాసింగి), ఎం.రత్నకుమారి (భీరం), ఎల్.మాలన్న (బొయితిలి), కె.రాంబాబు (జి.మాడుగుల), ఎం.చిలకమ్మ (కె.కోడాపల్లి), ఎం.కొండమ్మ (సింగర్భ), కె.రజని (వంజరి), ఐ.హనుమంతరావు (సొలభం), ఎస్.కొండబాబు (గెమ్మలి), కె.అప్పలమ్మ (గడుతూరు), ఎం.రాజులమ్మ (కోరాపల్లి), బి.చిన్నకుమారి (పెదలోచలి), జి.పద్మ (వంతాల)
ఓటు వేయకుండానే రాజమ్మ విజయం
బూసిపుట్టు పంచాయతీ నుంచి సర్పంచిగా పోటీ చేసిన కిల్లో రాజమ్మ తన ఓటు వేయకుండానే సర్పంచిగా విజయం పొందింది. డి.కంఠవరంలో సీహెచ్‌డబ్ల్యూగా పని చేసిన రాజమ్మ ఉద్యోగానికి రాజీనామా చేసి, సర్పంచిగా పోటీ చేశారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె భర్త నాగేశ్వరరావును మావోయిస్టులు ఎత్తుకెళ్లి దేహశుద్ధి చేశారు. మావోయిస్టుల హెచ్చరికతో రాజమ్మ, తన భర్తతో పాటు కుటుంబ సభ్యులు పోలింగ్‌కు దూరమయ్యారు. బూసిపుట్టు పంచాయతీ ఓటర్లు మాత్రం రాజమ్మకే పట్టం కట్టారు. 1024 మంది ఓటర్లు వున్న ఈ పంచాయతీలో 486 ఓట్లు పోలవ్వగా, రాజమ్మకు 310 ఓట్లు, ప్రత్యర్థి ముత్యాలమ్మకు 138 ఓట్లు పోలయ్యాయి. రాజమ్మ కుటుంబం పోలింగ్‌కు దూరంగా ఉన్నా.. ప్రజలు మాత్రమే సర్పంచి పీఠాన్ని ఆమెకే కట్టిబెట్టారు.
ఇదీ చూడండి.