ETV Bharat / state

PADERU HOSPITAL: సమస్యల వలయంలో పాడేరు ఆసుపత్రి - విశాఖ ఏజెన్సీ కేంద్రం

విశాఖ ఏజెన్సీ(Vishakha Agency) కేంద్రం పాడేరు ప్రభుత్వాసుపత్రిలో(paderu-government-hospital) పలు సమస్యలు ఉన్నాయి. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక గర్భిణీలు, బాలింతలు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రికి గర్భిణీలు, బాలింతలు ఎక్కువగా వస్తున్నా.. బెడ్ల సంఖ్యనూ పెంచడం లేదు. ఒకే బెడ్‌పై ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు.

పాడేరు ఆసుపత్రి
పాడేరు ఆసుపత్రి
author img

By

Published : Sep 22, 2021, 7:52 PM IST

సమస్యల వలయంలో పాడేరు ఆసుపత్రి

చుట్టుపక్కల ఉన్న గిరి ప్రాంతాల మహిళలకు ఆ స్త్రీ శిశు సంరక్షణ కేంద్రమే ఓ పెద్ద దిక్కు. మహిళలు, గర్భిణులు, బాలింతలు.. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడికి రావాల్సిందే. అంతటి ప్రాముఖ్యమున్న ఆ కేంద్రంలో ఇప్పుడు సేవలు పడకేశాయి. బాలింతలు, పసిబిడ్డలు కనీసం బేబీ కిట్లకు నోచుకోవడం లేదు. దీనికితోడు ఆస్పత్రికి రద్దీ పెరుగుతుండటంతో కనీస సదుపాయాలకూ సతమతమవుతున్నారు.

విశాఖ ఏజెన్సీ(Vishakha Agency) కేంద్రం పాడేరు ప్రభుత్వాసుపత్రి(paderu-government-hospital) కి మన్యం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణులు, బాలింతలు ఇతర సమస్యలున్న మహిళలు వస్తుంటారు. వీరందరికీ అవసరమైన మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో బిడ్డ పుట్టగానే పసికందుకు బేబీ కిట్లు ఇచ్చేవారు. కొంత కాలంగా అవేవీ అందడం లేదు. బయట కిట్లు కొనే స్తోమత లేక ఇంటి నుంచే దుప్పట్లు, పాత గుడ్డలు తెచ్చుకుని వాటినే ఉపయోగిస్తున్నారు.

ఆసుపత్రికి గర్భిణీలు, బాలింతలు ఎక్కువగా వస్తున్నా.. బెడ్ల సంఖ్యనూ పెంచడం లేదు. ఒకే బెడ్‌పై ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. ఇక వారి బాగోగులు చూసేందుకు వచ్చే తల్లిదండ్రులు, బంధువుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తాగునీరు కూడా కరవై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలూ ఇక్కడి మహిళలకు సక్రమంగా అందడం లేదు. ఆ సిబ్బంది తమకు నచ్చినవారికే సేవలు అందిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

"గత ప్రభుత్వ హయాంలో బిడ్డ పుట్టగానే బేబీ కిట్లు ఇచ్చేవారు. కొంత కాలంగా అవేవీ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇంటి నుంచే దుప్పట్లు, పాత గుడ్డలు తెచ్చుకుని వాటినే ఉపయోగిస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలూ ఇక్కడి మహిళలకు సక్రమంగా అందడం లేదు."

మణికుమారి, మాజీ మంత్రి

ఆస్పత్రి మొత్తానికీ ఒకే గైనకాలజిస్ట్ ఉండటంతో పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. సిబ్బంది కొరత సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

"ఆసుపత్రిలో గైనకాలజిస్టు, పీడియాట్రిస్టు స్పెషలిస్టు సిబ్బంది కొరత ఉంది. ఆంధ్రా వైద్యకళాశాలకు వెళ్లి దీనిపై పీజీ విద్యార్థుల్ని సంప్రదించాను. వారిలో కొందరు ఇక్కడికి వస్తామని చెప్పారు."

-గోపాలకృష్ణ, ఐటీడీఏ పీవో

ఇదీ చదవండి: TWINS BORN: మళ్లీ ఆ ఇంట ఆనందం.. గర్భశోకం మిగిల్చిన రోజే కవలలు జననం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.