ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ జిల్లా రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయం పూర్తిస్థాయికి చేరుకుంది. జలాశయం గేట్లు ఎత్తివేత ద్వారా అదనపు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. తద్వారా లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా... శనివారం రాత్రికి 459.4 అడుగులకు చేరింది.
కల్యాణపులోవ జలాశయం పరివాహక ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గేట్ల ఎత్తివేత మరో రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మంచు తెరల అందం... నయనానందం