ETV Bharat / state

ప్రకృతితో మమేకం.. సమస్యలతో సహజీవనం - vishakhapatnam

కొండా కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. రాజకీయాలు తెలియని మనస్తత్వం.. ఇదీ మన్యంలో గిరిపుత్రుల జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయలలూగుతూ... అడవితో పెనవేసుకుని సాగుతున్న వారి బతుకుల్లో చీకటి కోణాలెన్నో..! "అడవి మాకు అమ్మ.. ఒడిలో పెట్టుకుని ప్రేమగా సాకుతున్న పెద్దమ్మ.." అంటూ అమాయకత్వంగా చెబుతున్న ఆ అడవి బిడ్డల జీవితాల్లో కన్నీటి సంద్రాలెన్నో..!?

ఆ దుర్భర బతుకులు చూసి.. అడవి తల్లే రోదిస్తోంది!
author img

By

Published : Jun 26, 2019, 7:32 PM IST

ఆ దుర్భర బతుకులు చూసి.. అడవి తల్లే రోదిస్తోంది!

కొండల మధ్య నుంచి జాలువారే సెలయేళ్లు... భూమాతకు చీర సింగారించినట్టుండే పచ్చని సోయగాలు... ఎటు చూసినా ర‌మ‌ణీయ‌త ఉట్టిప‌డేట్టుండే ముగ్ధ మ‌నోహ‌ర దృశ్యాలు... వర్ణించలేని అందాలకు నెలవు విశాఖ మన్యం. ఈ సౌందర్యం మాటున ఓ హృదయ విదారకమైన జీవనం దాగుంది. మానవీయ కోణంతో చూడగలిగితే అక్కడి గిరిపుత్రుల వ్యథ కనిపిస్తుంది. ప్రశాంతతకు నిలువెత్తు నిదర్శనమైన అడవి తల్లి.. ఆ బిడ్డల కోసం రోదిస్తున్న కన్నీరు కళ్లకు కడుతుంది.

అడవినే నమ్ముకుని ...
సముద్రమట్టానికి సుమారు 3500 మీటర్ల ఎత్తులో ఉన్న విశాఖ ఏజెన్సీలో అడవినే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు గిరిపుత్రులు. కొండ భూముల్లో సాగు చేసుకుంటూ ఒకచోట నుంచి మరో చోటుకు వలస వెళుతుంటారు వీరంతా. పంటలకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుంటారు. అలా అందరూ తలోదారి వెతుక్కుంటూ కొండ లోయల్లోనే తలదాచుకుంటారు. ఇప్పుడిదే వీరిని కష్టాల కడలిలోకి నెట్టేసింది. లోయ ప్రాంతాలేవీ అభివృద్ధికి నోచుకోక... 50 ఏళ్ల క్రితం పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.

డోలీనే అంబులెన్స్...
గర్భిణీల అవస్థలైతే వర్ణనాతీతం. పురిటి నొప్పులు పడుతున్న సమయంలో... డోలీ కట్టి ఆస్పత్రికి తరలించిన సందర్భాలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో...తల్లీబిడ్డలు ప్రమాద బారిన పడి మృతి చెందిన సంఘటనలూ అనేకం. ఈ నెల 5న పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని డోలి కట్టుకుని కొండ గుట్టలు, అటవీ మార్గం దాటుకుంటూ 7 కిలోమీటర్లు నడిచి అంబులెన్స్‌లో చేర్చారు. తల్లి క్షేమంగా ఉన్నప్పటికీ శిశువు మరణించింది. పాడేరు మండలం బంధపొలంలో... ఓ మహిళను డోలీపై మోస్తుండగా మార్గంలోనే ప్రసవమైంది. ఇటీవలే అనంతగిరి మండలంలో ఓ గర్భిణి నడుస్తున్న సమయంలో ప్రసవమై... శిశువు ఇసుకలో పడిపోయింది. ఇలాంటి ఘటనలెన్నో ఈ మన్యంలో వెలుగు చూస్తూనే ఉంటాయి.

దశాబ్దాల దారిద్య్రం...
అడవిలో ఆదివాసీలు దశాబ్దాలుగా దారిద్య్రాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. కారణాలు ఎన్నో ఉండొచ్చు. కానీ...అడవి తల్లినే నమ్ముకుని బతుకుతున్న వీరిని ఆదుకోవటం ప్రభుత్వం విధి. ఆ బాధ్యత నిర్వర్తించటంలో నిర్లక్ష్యం వీడటం లేదు ఉన్నతాధికారులు. అప్పుడప్పుడు కాస్త హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప... శాశ్వత పరిష్కారం చూపటం లేదు. గిరిజన లోతట్టు, కొండల గ్రామాల గిరిజన జీవితాలు బాగుపడాలంటే ప్రత్యేక కార్యాచరణ తీసుకురావాలి. మౌలిక వసతుల్లో ప్రధానమైన రహదారి సౌకర్యం కల్పిస్తే అన్ని సమస్యలు పరిస్కారం అవుతారని గిరిపుత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా... అరణ్యంలోని ఈ అభాగ్యులకు దిక్కెవరు..? అడవికి దగ్గరగా...అభివృద్ధికి దూరంగా బతుకుతున్న వీరిని ఆదుకునేదెవరు..? ఎన్నో ఏళ్లుగా... ఇవి సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగిలి పోతున్నాయి. ప్రపంచమంతా రోజుకో కొత్త హంగుతో ముస్తాబవుతుంటే... విశాఖ మన్యంలోని ఆదివాసీలు మాత్రం... కనీస వసతుల కోసం ఎదురుచూ....స్తూనే ఉన్నారు.

ఇదీ చదవండీ: ఆ మాయావృక్షం ఎదుట సురీడూ చిన్నబోవాల్సిందే!

New Delhi, June 26 (ANI): Scientists have identified a species of bacteria in the human infant gut that protects against food allergies and may be used in therapies to reverse the condition. In preclinical studies in a mouse model of food allergy, it was founded that giving an enriched oral formulation of five or six species of bacteria found in the human gut protected against food allergies and reversed established disease by reinforcing tolerance of food allergens. The team repeatedly collected faecal samples every four to six months from 56 infants who developed food allergies, finding many differences when comparing their microbiota to 98 infants who did not develop food allergies. Faecal microbiota samples from infants with or without food allergies were transplanted into mice that were sensitised to eggs. Mice who received microbiota from healthy controls were more protected against egg allergy than those who received microbiota from the infants with food allergies. Two separate consortia of five or six species of bacteria derived from the human gut that belong to species within the Clostridiales or the Bacteroidetes could suppress food allergies in the mouse model, fully protecting the mice and keeping them resistant to egg allergy. Other species of bacteria did not provide protection. The team looked at immunological changes, both in the human infants and in mice. It was found that the Clostridiales and Bacteroidetes consortia targeted two important immunological pathways and stimulated specific regulatory T cells, a class of cells that modulate the immune system, changing their profile to promote tolerant responses instead of allergic responses. Effects were found both in the pre-clinical models and also found to occur in human infants.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.