ETV Bharat / state

పాతగోపాలపట్నానికి తీరిన కష్టం.. గంటల వ్యవధిలోనే సబ్‌వే నిర్మాణం - గేటు పోయి.. రూటు వచ్ఛే. మరో రెండు నిర్మిస్తే.. రవాణా సమస్యలు దూరం

ఆ మార్గం పేరు చెబితే ఆర్టీసీ బస్సు రాదు... ఎప్పుడు ఏ కష్టమొచ్చి బయల్దేరినా.. గేటు ఎప్పుడు పడుతుందో తెలీదు.. ఎంతసేపుంటుందో తెలీదు.. ఇన్నాళ్లకు ఆ కష్టాలన్నీ తీరిపోయాయి. గేటు బాధ తప్ఫి. కొత్త రూటు అందుబాటులోకొచ్చింది. నగరంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డు బాజీ జంక్షన్‌ నుంచి పాతగోపాలపట్నం మధ్య సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో తక్కువ ఎత్తు సబ్‌వేని వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు నిర్మించారు. పనులను మంగళవారం ఉదయం ప్రారంభించి.. సాయంత్రానికల్లా పూర్తి చేశారు.

vishaka district
సబ్‌వే పనుల వద్ద ఎమ్మెల్యే గణబాబు
author img

By

Published : Apr 29, 2020, 10:23 AM IST

విశాఖ జిల్లా పాతగోపాలపట్నం అనగానే అందరికి ముందు గుర్తుకు వచ్చే విషయం రైల్వే గేటు. అక్కడ ఎంతోమంది విసుక్కుంటూ వేచి ఉన్న అనుభావాలే ఉంటాయి. నగరంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డు బాజీ జంక్షన్‌ నుంచి పాతగోపాలపట్నం మధ్య సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో తక్కువ ఎత్తు సబ్‌వేని వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు నిర్మించారు. పనులను మంగళవారం ఉదయం ప్రారంభించి.. సాయంత్రానికల్లా పూర్తి చేశారు.

ఆ ప్రాంతాలకు మేలు..

పదేళ్ల కిందటి మాట.. పాతపోస్టాఫీసు నుంచి బాజీ కూడలి, పాతగోపాలపట్నం మీదుగా చింతకట్ల వరకు ఓ ఆర్టీసీ బస్సు వెళ్లేది. అప్పట్లో గేటు వేస్తే గంట, గంటన్నరదాకా బస్సు ఆగిపోయేది. దీంతో ప్రజలు, ఆర్టీసీ అధికారులు విసిగెత్తిపోయేవారు. చివరకు 2009-10లో ఆ బస్సును రద్దు చేశారు. అప్పటి నుంచి ఆ రూట్లో బస్సులు తిరగలేదు.

  • తాజాగా గేటు లేకుండా సబ్‌వే నిర్మించటంతో భారీ వాహనాలు కాకపోయినా కనీసం ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, ఇతర వాహనాలు అడ్డంకుల్లేకుండా వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది.
  • ఈ మార్గంలో పాతగోపాలపట్నం మీదుగా మహాత్మాఆదర్శనగర్‌, కొత్తపాలెం, నరవ, జెర్రిపోతులపాలెం, చింతకట్ల మీదుగా సబ్బవరం వైపు కూడా వెళ్లేందుకు మార్గాలున్నాయి.
  • ప్రస్తుతం పాతగోపాలపట్నం పక్కనున్న రైలుమార్గాల ద్వారా రోజుకు 35 నుంచి 40 రైళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇవొచ్చినప్పుడల్లా గేటు పడుతుందనే బాధ తప్పినట్లవుతోంది.
  • గత 10 ఏళ్లలో ఈ రైల్వేగేటు సమీపంలో 4 ప్రమాదాలు జరిగాయి. నలుగురు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రణాళికలో మరో రెండు..

పాతగోపాలపట్నం దాటాక మహాత్మాఆదర్శనగర్‌ సమీపంలో మరో రెండు గేట్లు ఉన్నాయి. ఇవి అతి కీలకమని స్థానికులు, ఇక్కడ కూడా సబ్‌వేలు నిర్మిస్తే కష్టాలు పూర్తిగా తీరినట్టేనని స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వాల్తేరు అధికారుల దగ్గర ప్రస్తావించినప్పుడు.. ప్రస్తుతం ఉన్న నిధుల ప్రకారం మొదట ఒక సబ్‌వే నిర్మించామని, మిగిలినవి ప్రతిపాదన దశలో ఉన్నాయన్నారు. నిధులు సమకూరగానే వాటినీ నిర్మిస్తామని చెప్పారు. దీనికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

2016లోనే కలెక్టర్‌ ఎన్‌వోసీ ఇచ్చారు

పాతగోపాలపట్నంలోని రైల్వేగేటు సమస్యతో స్థానికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్‌ పాత్‌వే నిర్మాణంతో ఆ కష్టాలన్నీ తొలగినట్టే. 2016లో జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించిన నాటి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌... అండర్‌ పాత్‌వే నిర్మాణానికి వెంటనే ఎన్‌వోసీ జారీ చేశారు. తెదేపా హయాంలో రాష్ట్ర నిధులతో ఆర్పీపేట అండర్‌పాత్‌ బ్రిడ్జిని నిర్మించగా..., 104 ఏరియా, మర్రిపాలెం, పాతగోపాలపట్నం బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వేశాఖ నిధులిచ్చింది. అప్పటి డీఆర్‌ఎం చంద్రలేఖ కీలకపాత్ర పోషించారు. కొత్తపాలెం, ఎల్లపువానిపాలెం, చంద్రనగర్‌ తదితర గ్రామాలకు భారీ వాహనాలు వెళ్లేలా ఇక్కడ అండర్‌పాత్‌ బ్రిడ్జి ఎత్తును కాస్త పెంచి నిర్మించాం. -పి.గణబాబు, పశ్చిమ ఎమ్మెల్యే.

పనులను పరిశీలించిన ఎంపీ

పాతగోపాలపట్నం రైల్వేగేటు వద్ద అండర్‌పాత్‌వే బ్రిడ్జి పనులను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పశ్చిమ వైకాపా సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ మరికొన్ని రైల్వే అండర్‌పాత్‌వే బ్రిడ్జి పనులకు టెండర్లు పిలవాల్సి ఉందన్నారు.

పనులను పరిశీలిస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

ఇది చదవండి అకాల వర్షం.. రైతన్నకు మిగిల్చింది శోకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.