ETV Bharat / state

సంతలో కొన్న చొక్కా... ప్రాణాల మీదకు తెచ్చింది..!

తక్కువ ధరకే వస్తుందని చొక్కాను కొనగా అది ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చలికాలంలో ఉపయోగపడుతుందని అనుకుంటే పోలీసులతో తన్నులు తినేలా చేసింది.

మావో డ్రెస్
author img

By

Published : Oct 9, 2019, 6:26 AM IST

Updated : Oct 9, 2019, 7:01 AM IST

సంతలో కొన్న చొక్కా... ప్రాణాలమీదకు తెచ్చింది

చలి నుంచి తట్టుకునేందుకు కొనుక్కున్న చొక్కా గిరిజన రైతుకు ఇబ్బంది తెచ్చిపెట్టిన సంఘటన విశాఖ మన్యంలో జరిగింది. పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ వనభరగికి చెందిన రవి అనే గిరిజనుడు స్థానికంగా జరిగే సంతలో ముదురు ఆకుపచ్చ రంగుతో కూడిన చొక్కా, బూట్లను కొన్నాడు. వాటిని ధరించి సమీపంలోని మరో గ్రామానికి వెళ్తుండగా అతడిని మావోయిస్టుగా భావించిన కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంతకాలం నుంచి మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాను మావోయిస్టుని కాదని, చలితీవ్రతకు తట్టుకునేందుకు మందంగా ఉందని భావించి చొక్కాను కొన్నానని పోలీసులకు వివరించాడు. అయినా నమ్మకపోవటంతో, స్థానిక గిరిజన పెద్దలు ఎస్సై రాజారావును కలిసి రవికి చెందిన ఆధార్‌, రేషన్‌కార్డులను చూపించారు. వివరాలు సరిపోవటంతో చివరికి విడిచిపెట్టారు. కొనే దుస్తులపై మరింత జాగ్రత్తగా ఉండాలని స్థానిక గిరిజనులకు పోలీసులు సూచించారు.

Intro:Ap_vja_02_09_Navari_Sambaralu_av_Ap10052
sai babu_ Vijayawada : 9849803586
యాంకర్ : దేవీ నవరాత్రుల ముగింపు రోజు దసరా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ అ నగర శివారు ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలతో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.. విజయవాడ రూరల్ మండలం పాతపాడు, నున్న ,కండ్రిక ,రామవరపాడు ప్రాంతాల్లో దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు పూజల అనంతరం చివరిరోజు నవరాత్రుల పూజలు అందుకున్న అమ్మ వారి విగ్రహాలను ఆయా గ్రామాల్లో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.. పాత పాడు గ్రామం లో అమ్మవారు ఊరేగింపులో నిర్వహించిన వివిధ రకాల వేషధారణలో గ్రామస్తులు ఆకట్టుకున్నాయి..

Body:Ap_vja_02_09_Navari_Sambaralu_av_Ap10052

Conclusion:Ap_vja_02_09_Navari_Sambaralu_av_Ap10052
Last Updated : Oct 9, 2019, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.