ETV Bharat / state

'బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించడమే ప్రజారోగ్యం ముఖ్య ఉద్దేశ్యం' - ఆంధ్రప్రదేశ్ తాజా సమావేశాలు

AP Governor Biswabhushan Harichandan attended the AAPI seminar: విశాఖపట్నంలో నేడు జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ (AAPI) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దృశ్యశ్రవణ మాధ్యమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రోగుల ఆరోగ్య సంరక్షణకు AAPI చేస్తోన్న సహాయానికి ఆయన అభినందనలు తెలిపారు.

AAPI meeting
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గ్లోబల్ హెల్త్ సమ్మిట్
author img

By

Published : Jan 7, 2023, 7:29 PM IST

AP Governor Biswabhushan Harichandan attended the AAPI seminar: విశాఖపట్నంలో జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్ దృశ్యశ్రవణ మాధ్యమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశంలో రోగుల ఆరోగ్య సంరక్షణకు AAPI చేస్తోన్న సహాయానికి అభినందనలు తెలిపారు. మహిళలకు క్యాన్సర్ పరీక్షల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ముదావహమన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించడమే ప్రజారోగ్యం ముఖ్య ఉద్దేశ్యమని, దీనికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ప్రజారోగ్య రంగంలో మన దేశం సవాళ్లను ఎదుర్కొంటుందని, పేదరికం వల్ల ఒక దశాబ్దం నుంచి దేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గిందన్నారు. దేశం శక్తివంతమైన ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ పరిశ్రమలతో పాటు.. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నప్పటికీ, పిల్లల పోషకాహార లోపం, తక్కువ జనన బరువుల పరంగా సవాల్‌ను ఎదుర్కొంటోందని వివరించారు. అకాల మరణాలు, జీవితకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ధనవంతులు, పేదల మధ్య, పట్టణ, గ్రామీణ ప్రాంతవాసుల మధ్య అసమానతలు కొనసాగుతున్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'ఆయుష్మాన్ భారత్ యోజన' పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందజేస్తుందని, కార్పొరేట్ సంస్ధలు సామాజిక బాధ్యతగా వ్యాధుల నివారణ కార్యకలాపాలలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అధ్యక్షుడు డాక్టర్ రవి, ఇండియా చాప్టర్ ప్రతినిధి డాక్టర్ టి రవిరాజు, డాక్టర్ ప్రసాద్ చలసాని, డాక్టర్ సుధాకర్, డాక్టర్ సంగీతారెడ్డి, డాక్టర్ జగదీష్ బాబు, అమెరికా, ఇండియా నుంచి ఫ్యాకల్టీ, ప్రతినిధులు, ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ ఇండస్ట్రీ సీఈఓలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.