12 ఏళ్ల బాలిక ఫిర్యాదుపై అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ విశాఖ జిల్లా రోలుగుంట మండలం బీబీ పట్నం గ్రామంలో విచారణ చేపట్టారు. బాలికను అదే మండలం రత్నం పేట గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు కొద్దిరోజులుగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. బాలిక పలుమార్లు హెచ్చరిచ్చినప్పటికీ పట్టించుకోకుండా.. తనను మానసికంగా వేధిస్తున్నాడని బాలిక రోలుగుంట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేశారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలపై ఆరా తీశారు.
ఇవీ చూడండి...: ఎన్నికల కారణంగా.. విశాఖలో జాతీయ రహదారి నిర్బంధం విరమణ