రాష్ట్ర అధికార భాష సంఘం రూపొందించిన 'పదకోసం-మీకోసం' అనే పుస్తకం ఆవిష్కరణ విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగింది. ఆ పుస్తకాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అధికారికంగా ఉపయోగించే పదజాలాన్నితెలుగు-ఇంగ్లీష్ అనువాదం చేసి పుస్తకం రూపంలోకి తెచ్చిన అధికార భాష సంఘానికి ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అధికార భాష సంఘం కార్యాలయాన్ని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్న ఘనత సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు భాష కేంద్రంగా విశాఖ విరాజిల్లుతుందని అందులో అనుమానం లేదని అధికార భాష సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.
ఇవీ చదవండి