అనకాపల్లిలో నూకాలమ్మ జాతర రద్దు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ. అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరొనా ప్రబలుతున్న ఈ నేపథ్యంలో మార్చి 22వ తేదీన ప్రారంభం కావాల్సిన నూకాలమ్మ జాతర భక్తులు లేకుండానే పూజా కార్యక్రమాలతో జరిపారు. నెల రోజుల పాటు జరగనున్న జాతరలో భాగంగా ఏప్రిల్ 22వ తేదీన ఈ నెల పండుగ నిర్వహించాల్సి ఉంది. మే మూడో తేదీ వరకు లాక్ డౌన్‌ని పొడిగించటంతో జాతరని రద్దు చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఆన్లైన్లో టిక్కెట్ల ద్వారా అమ్మవారికి భక్తుల పేరిట ఆలయ పురోహితులతో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇది వస్తే ఆన్ లైన్ టికెట్లు అమ్మకాలు చేస్తామని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారిణి అన్నపూర్ణ తెలిపారు.
ఇది చదవండి కానిస్టేబుల్ ఔదార్యం.. మతిస్థిమితం లేని వ్యక్తికి సహాయం