విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలోని హుకుంపేట జూనియర్ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హుకుంపేట జూనియర్ కళాశాలను గిరిజన ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు, పాఠశాలను జూనియర్ కళాశాల భవనానికి మార్చుతూ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్డర్స్ పంపించారు. ఈ నిర్ణయాన్ని కాళాశాల విద్యార్థులకు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. తమకు ఇక్కడ రక్షణ, మైదానంతో పాటు చదువుకోవటానికి అన్నిరకాల వసతులున్నాయని, పాఠశాల భవనం దగ్గర అవి ఏమి లేవని కళాశాల విద్యార్థినులు వాపోయారు. అక్కడి వచ్చిన పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను గేటు వద్ద అడ్డుకున్నారు.
సమాచారం అందుకున్న గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు విజయ్ కుమార్ కళాశాలకు చేరుకున్నారు. విద్యార్థినిలకు నచ్చజేప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఖాళీ చేయమని తేల్చి చెప్పారు. ఐదుగురు విద్యార్థి నాయకులకు ప్రిన్సిపాల్ టీసీలు ఇచ్చేస్తామని బెదిరించటంతో మిగతా విద్యార్థులు గొల్లుమన్నారు. తమకు టీసీలు ఇవ్వాలని...ఇళ్లకు వెళ్లి పోతామన్నారు.
చివరకు ఐదుగురు విద్యార్థి నాయకులను తన వాహనంలో ఎక్కించుకుని విజయ్ కుమార్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వద్దకు తీసుకువెళ్లారు. నేటికి పాఠశాల విద్యార్థులను తిరిగి అదే భవనానికి వెళ్లాలని సూచించారు. కళాశాల విద్యార్థులను ఖాళీ చేయించకుండా రెండు మూడు సార్లు అటూ ఇటూ తిప్పడంపై పాఠశాల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల అరెస్ట్ అప్రజాస్వామికం '