Temperatures fall down at Visakha Agency: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి పెరిగిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలైనా మంచు దుప్పటి వీడటం లేదు. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. చలిని తట్టుకోలేక పలువురు చలిమంటలు వేసుకుంటున్నారు.
విశాఖపట్నం జిల్లా మాన్యంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. చలిగుప్పిట్లో మాన్యం ప్రజలు వణికిపోతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున మినుములూరులో 8.22 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. మరోపక్క మాన్యంలో అధిక చలి తీవ్రత, పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెరుగుతున్న ఫ్లూ, చర్మవ్యాధుల కేసులు
నగరంలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మరో పక్క శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ప్రజలను చుట్టుముడుతున్నాయి. రానున్న కొద్దిరోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శీతల గాలలు వీయడం, మంచు అధికంగా పడుతుండడంతో జలుబు, దగ్గు, ఆస్మా, బ్రాంకైటీస్, కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడడం, ఛాతిలో నెమ్ము చేరడం వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రైవేటు క్లీనిక్కులతో పాటు కేజీహెచ్ ఓపీ విభాగాలకు ఈ తరహా ఇబ్బందులతో వస్తున్న రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది.
- జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా వంటి లక్షణాలతో కేజీహెచ్ ఓపీ విభాగాలకు గత వారం నుంచి రోజుకు 70 నుంచి 80 మంది వరకు బాధితులు వస్తున్నారు. వైద్యుల అంచనా ప్రకారం ప్రైవేటు క్లీనిక్కులకు వెళ్లే వారితో కలిపి ఈ సంఖ్య వందల్లో ఉంటోంది. ప్రారంభ దశలో జాగ్రత్తలు తీసుకోవాలని, అలక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
పిల్లలు, వృద్ధుల్లో అధికం
- ‘నగరంలో చలి ప్రభావానికి గురైన వృద్ధులు, పిల్లల్లో అలర్జీ లక్షణాలు కనిపిస్తున్నాయి. చలికి కాళ్లు, చేతులు ముడుచుకొని ఉండడం వల్ల కీళ్ల సంబంధమైన ఇబ్బందులు వస్తున్నాయి. కీళ్ల వాతం వస్తోంది. కొంత మందిలో శ్వాసకోస సమస్యలు కనిపిస్తున్నాయి. చర్మం పొడిబారి దురద, మంట వస్తోంది. వేళ్లు, శరీరంపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. కొంత మందిలో జ్వర లక్షణాలు కనిపిస్తున్నాయ’ని కేజీహెచ్ వైద్యులు డాక్టర్ డాక్టర్ వై.జ్ఞానసుందర్రాజు చెబుతున్నారు.
చలి తీవ్రత దృష్ట్యా ఫ్లూ బాధితులు పెరుగుతున్నారు. పలువురు శ్వాసకోస ఇబ్బందులతో వస్తున్నారు. కొందరికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటున్నాయి. ఆస్తమా, బ్రాంకైటీస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇవన్నీ కొవిడ్ లక్షణాలను పోలి ఉంటున్నాయి. శీతాకాలంలో వచ్చే ఫ్లూ రెండు రోజులకు మించి ఉండదు. సకాలంలో చికిత్స తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఇవి రాకుండా ఉండేందుకు ఫ్లూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. - డాక్టర్ బి.జ్ఞాన సుందర్రాజు, ప్రొఫెసరు, మెడిసిన్ విభాగం, కేజీహెచ్
చర్మాన్ని పొడిబారనీయొద్దు
శీతాకాలంలో పిల్లలు, వృద్ధుల్లో చర్మ సంబంధిత సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. పొలుసు వ్యాధి విజృంభించే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు చర్మం పొడి బారకుండా చూసుకోవాలి. పొడి బారితే దురదలు వస్తాయి. కొబ్బరినూనె రాస్తే మేలు. కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ తరహా ఇబ్బందులతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. చర్మవ్యాధులు ఉన్నవారు చలిగాలులకు లోనవకుండా చూసుకోవాలి. - డాక్టర్ బి.బాలచంద్రుడు, విశ్రాంత ఆచార్యులు, కేజీహెచ్
తెలంగాణలో చలి పంజా..
తెలంగాణను చలిపులి గజగజ వణికిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. అడవుల జిల్లా తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచుతో కశ్మీర్‌ను తలపిస్తోంది. మరోవారం రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో చలిముప్పును తట్టుకోవడానికి అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నందున అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
Telangana Temperature Drops : తెలంగాణపై చలి పంజా విసురుతోంది. మరో రెండు వారాలూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయని తెలిపింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండనుంది. సోమవారం తెల్లవారుజామున రాష్ట్రంలో అత్యల్పంగా సిర్పూరు(కుమురంభీం జిల్లా)లో 6, మెదక్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి అధికంగా ఉంటోందని వాతావరణ కేంద్రం రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
Lowest Temperature Telangana : ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గితే ఆరోగ్య సమస్యలు విజృంభించే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి ముప్పును తప్పించుకోవడానికి ముందు జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. ఇప్పటికే ఫ్లూ జ్వరాలు, నిమోనియా, ఆస్తమా తదితర వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. చలి తీవ్రత పెరిగే కొద్దీ గుండెపోటు ముప్పు కూడా అధికంగా ఉంటుందనీ.. ఈ సమయంలో పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారిలో వ్యాధుల తీవ్రత ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Telangana Suffers From Cold : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వేకువజామునే దట్టమైన పొగమంచు కురుస్తుండగా.. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి వాగులో సోమవారం నీటిపై ఆవరించిన పొగమంచు ఇలా..
ఇదీ చదవండి..
CM Jagan On Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లలో వారి పాత్ర ఉండొద్దు: సీఎం జగన్