కరోనా కష్ట కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలను మరింత అవస్థలకు గురిచేయడానికి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు రెట్టింపు స్థాయిలో పెంచిందని, తక్షణమే వాటిని రద్దు చేయాలని విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్, మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు తెదేపా కార్యాలయంలో నిరసన చేపట్టారు. రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... ఏ ఘనకార్యాలు సాధించారని సంబరాలు?: యనమల