మూడు రెట్లు పెంచిన కరెంట్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో తెదేపా నేతలు నిరసన దీక్షను చేపట్టారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో రామ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయంలో నాయకులంతా విద్యుత్ బిల్లులతో ముద్రించిన టీ -షర్టులు ధరించి నిరసనలో పాల్గొన్నారు. కరోనా వ్యాధి నేపథ్యంలో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, పెంచిన విద్యుత్ రేట్లను తగ్గించటమే కాకుండా కరెంట్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కష్ట కాలంలో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డ్ ఉన్న పేద వాళ్లందరికీ 5 వేల చొప్పున ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...