స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం పావులు కదుపుతోందని.. పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని.. తెదేపా ఎంపీలు రాజీనామాకు సిద్ధమని తెలిపారు. జీవీఎంసీ ఎన్నికల్లో ఆడిన డ్రామాలను కట్టిబెట్టి.. వైకాపా నాయకులు.. ప్రైవేటీకరణ మీద కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. భాజపా నాయకులు కూడా తక్షణమే స్పందించాలన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ తక్షణమే అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని పల్లా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఆగని కార్చిచ్చు- లక్షల ఎకరాలు దగ్ధం