విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దంటూ చేపట్టిన ఉద్యమానికి... ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఎమ్మెల్యే వెలగపూడి పార్టీ కార్యాలం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్యే వెలగపూడితో, తెదేపా నేతలు పల్లా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు, తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ప్రధానికి సీఎం జగన్ రాసిన లేఖతో.. రాష్ట్రానికి ఉపయోగం లేదు'