విశాఖ జిల్లాలో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయని.. సరైన వైద్య సదుపాయాలు లేకే మృతుల సంఖ్య పెరుగుతోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. మరణాల సంఖ్య విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కొవిడ్ పరీక్షల ఫలితాలు వేగంగా వచ్చేలా చూడాలని.. లేకపోతే వైరస్ వ్యాప్తి అధికమవుతుందన్నారు. కరోనా బాధితులను గుంపులు గుంపులుగా బస్సులో తీసుకెళ్లడం సరికాదని సూచించారు. జిల్లాలో హోం ఐసోలేషన్లో ఉన్నవారికి ఒక్క కిట్ కూడా అందలేదన్నారు. కరోనాతో మృతి చెందిన వారికోసం ఊరి శివార్లలో ఖననానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
ఇవీ చదవండి..