రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే, మాడుగుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ గవిరెడ్డి రామానాయుడు అన్నారు. విశాఖ జిల్లా చీడికాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ.. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెదేపా శ్రేణులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామానాయుడు డిమాండ్ చేశారు. ఎస్సీ, బీసీ, మహిళలపై వైకాపా దాడులు చేస్తుందని, ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని కోరారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఇవీ చూడండి...