విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆరోగ్య కేంద్రంలో మహిళ ప్రసవం ఘటనపై తెదేపా నేత పాసర్ల ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతాడ లక్ష్మి అనే గర్భిణి చికిత్స కోసం సింహాచలం ఆరోగ్య కేంద్రానికి వస్తే ఆమెకు చికిత్స చేయకుండా.. కరోనా టెస్ట్ చేయించుకోమని చెప్పడం దారుణమని ప్రసాద్ ఆక్షేపించారు. పురిటి నొప్పులతో బాధపడుతూ కరోనా టెస్టు కోసం వచ్చిన ప్రజల మధ్యే ప్రసవించడం దయనీయమన్నారు. సమయానికి వైద్యులు చికిత్స అందించి ఉంటే.. శిశువు ఆరోగ్యంగా ఉండేదని మండిపడ్డారు. ఈ ఘటనను కప్పిపుచ్చుకునేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ప్రయత్నించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.