ETV Bharat / state

'విశాఖ స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేట్​పరం కానివ్వం'

వేదాంతకు అప్పగించిన తర్వాత జింక్ పరిశ్రమ కుదేలయ్యిందని.. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్​కు అదే పరిస్థితి వస్తుందని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

palla srinivasarao
తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు
author img

By

Published : Feb 6, 2021, 2:28 PM IST

జింక్ పరిశ్రమను వేదాంతకు అప్పగించిన తర్వాత పూర్తిగా కుదేలైందని.. ఇప్పుడు అదే దుస్థితి విశాఖ స్టీల్ ప్లాంట్​కు వచ్చేలా ఉందని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. జింక్ పరిశ్రమకు చెందిన 400 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అదే తరహాలో స్టీల్ ప్లాంట్​కు చెందిన 30 వేల ఎకరాలు ప్రైవేట్ పరం చేసి భూవ్యాపారం చేయాలనే ఆలోచన చేస్తునట్టు ఆరోపించారు. ఉక్కు పరిశ్రమలో కేంద్రం అమ్మాలనుకున్న వాటాను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్రానికి తలమానికమైన స్టీల్ ప్లాంట్ అమ్మాలని చూస్తే కార్మిక లోకం చూస్తూ ఊరుకోదని టీఎన్​టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘు రామరాజు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సైతం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాలు పంచుకుంటారని చెప్పారు.

ఇదీ చదవండి: విశాఖలో విక్రయించి... ఉత్తరప్రదేశ్​లో కొత్తది స్థాపిస్తారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.