Palla srinivas rao fires on CM: సీఎం జగన్.. ఉక్కు కార్మికుల దీక్షకు సంఘీభావం తెలపాలని.. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నాయకులు, నిర్వాసితులను.. విశాఖ వస్తున్న రాష్ట్రపతి, కేంద్ర మంత్రుల దగ్గరకి.. సీఎం జగన్ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి.. జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఉక్కు కార్మిక సంఘాల నాయకులను.. ఎంపీ విజయసాయి రెడ్డి బ్లాక్ మొయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
రుషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం పూర్తయినా.. ఎందుకు ప్రారంభించటం లేదని శ్రీనివాసరావు ప్రశ్నించారు. త్వరలో దేవాలయం ప్రారంభించకపోతే.. నిరసన కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఓటు బ్యాంకు కోసమే హిందూవుల మీద ప్రేమ ఉన్నట్లు సీఎం జగన్ నటిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:
Milan 2022 : విశాఖలో సందడి.. నౌకాదళ విన్యాసాల కోసం కొత్త సొబగులు అద్దుకున్న నగరం