విశాఖ ఉక్కు కోసం ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న పాదయాత్రపై తెదేపా రాష్ట్ర కార్యదర్శి నొడగల కృష్ణ విమర్శలు చేశారు. ఈ పాదయాత్రలో నిజాయతీ లేదని.. ఎన్నికల సందర్భంగా విశాఖ ప్రజలను మభ్యపెట్టేందుకు పాదయాత్ర చేస్తున్నారని కృష్ణ ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన విలువైన భూములను కబ్జా చేసేందుకు విజయసాయిరెడ్డి, తదితరులు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఆనాటి త్యాగాల స్ఫూర్తితో గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీలు.. ప్రధానికి వినతి పత్రం సమర్పించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు కోసం పార్లమెంట్ లోపల, బయట పోరాడతాం'