ముగ్గురు భాజపా నేతలు రాష్ట్రానికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయాలకు వంతపాడుతూ, మోదీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి ఆక్షేపించారు. అమరావతిని చంపడం కోసం ఉత్తరాంధ్ర వాసుల భుజంపై తుపాకీ పెడతారా? అని నిలదీశారు. ఉత్తరాంధ్రపై నిజంగా జగన్ కు ప్రేమ ఉంటే.. ఉత్తరాంధ్రకు రావాల్సిన వెనకబడిన ప్రాంత నిధులు, రైల్వేజోన్ గురించి జగన్ ఒక్కరోజైనా కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మీద కక్షతో అమరావతిని చంపేసే చర్యలు తప్ప, జగన్కు నిజంగా ఉత్తరాంధ్రపై అభిమానం ఉందా అని నిలదీశారు.
విశాఖపట్నంలో భూముల విలువ ఎక్కువ ఉంది కాబట్టే, రాయలసీమకు చెందిన జగన్ అనుచరులు దానిపై కన్నేశారని విమర్శించారు. కేసీఆర్ తో స్నేహం ఉంది కాబట్టి, హైదరాబాద్ ను వదిలేసి విశాఖపై పడ్డారన్నారు. ఎన్నికల ముందు విశాఖలో రాజధాని పెడతానని చెప్పి ఉంటే జగన్ ను నమ్మి ఉండే వాళ్లమని బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఈ నెల 12న వైఎస్‌ఆర్ చేయూత పథకం ప్రారంభం