పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా ఏ-2రెడ్డి (విజయసాయి రెడ్డి)ని ప్రజలు క్షమించరని తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. ఉక్కు జోలికొస్తే, పాదయాత్రను పరుగుయాత్రగా మార్చి తరిమి కొడతామని ఆయన హెచ్చరించారు. విజయసాయి రెడ్డి విశాఖలో తిష్టవేసి.. చేసిన పాపాలు పాదయాత్రతో తీరేవి కాదని స్పష్టంచేశారు.
కేసుల మాఫీ కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని సత్యనారాయణమూర్తి ఆక్షేపించారు. పార్లమెంటు, స్టాండిగ్ కమిటీల్లో ఎంపీలు ఉండి.. ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పార్లమెంటులో ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. పోస్కోతో కుమ్మక్కై ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్మేశారన్నారు మండిపడ్డారు.
ఇదీ చదవండి: నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం.. ప్రధాని దృష్టికి రాష్ట్ర సమస్యలు