AYYANNA LETTER TO PM : విశాఖ వచ్చినప్పుడు రుషికొండను కళ్లారా వీక్షించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు లేఖ రాశారు. ఏరియల్ సర్వే చేయటం ద్వారా రుషికొండ అక్రమాలు స్వయంగా వీక్షించవచ్చని లేఖలో తెలిపారు. ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతికి భిన్నంగా 3రాజధానులంటూ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరును లేఖలో ప్రస్తావించారు. అమరావతి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి కొనసాగుతుందనే స్పష్టతను సీఎంకి ఇవ్వాలని ప్రధానిని కోరారు. మూడున్నరేళ్లుగా పోలవరం పనులు జరగలేదని.. ప్రధానమంత్రి స్థాయిలో ఓ మీటింగ్ నిర్వహించి పోలవరం పూర్తయ్యేలా చూడాలన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల 12న విశాఖ పర్యటనకు రానున్నారు. రూ.10,472 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
ఇవీ చదవండి: