రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్టులే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ చేయకుండా మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి నిందారోపణలు చేయటం సిగ్గుచేటని పేర్కొన్నారు. సమాచార శాఖ మంత్రిగా ఉన్న పేర్నినాని ప్రజలకి వాస్తవాలు వివరించడం లేదని నాగజగదీశ్వర రావు మండిపడ్డారు.
ఇదీ చూడండి