విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో తెదేపా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కార్యకర్తలతో సమావేశమయ్యారు. జగన్ పరిపాలన తుగ్లక్ పరిపాలనకు ఏమాత్రం తీసిపోదని ఆమె పేర్కొన్నారు. కార్యకర్తలతో మాట్లాడుతూ...కావాలి జగన్ రావాలి జగన్ అని ప్రజలు 153 అసెంబ్లీ స్థానాలు గెలిపిస్తే భవన కార్మికుల నుంచి వృద్ధుల వరకు కష్టాలపాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలని తొలగించి ముఖ్యమంత్రి జగన్ పేదల బతుకులతో ఆటలు ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి