ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని తెదేపా విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి న్యాయస్థానం ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా స్పందన లేదన్నారు. కరోనా కట్టడిలో సర్కారు విఫలమైందని విమర్శించారు. తెదేపా పాలనలో... ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా జన్మభూమి కమిటీలు నిజాయితీగా సేవాలందించారని.. వైకాపా పాలనలో కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి ప్రజాధనాన్ని దోచుపెడుతున్నారని ఆరోపించారు. సీఎంతో పాటు మంత్రులు అమరావతి రాజధానిపై ఆరోజు ఒకమాట మాట్లాడి.. నేడు మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని... లేదంటే విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటించాలన్నారు. వైకాపా తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మూడు రాజధానులు ఏర్పాటు అంటూ నాటకాలు ఆడుతుందన్నారు.
ఇదీ చదవండి:
'కొత్త ప్రాజెక్టులు ఆపండి'.. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జల్‌శక్తి శాఖ లేఖ