TDP Leader Kondrumuralli Coments On CM Jagan: విశాఖలో జరిగిన టీడీపీ సమావేశంలో మాజీ మంత్రి కొండ్రు మురళి, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జి సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో దళితులకు జగన్ సర్కార్ అపకారం చేస్తోందని, సీఎం ఒక దళిత ద్రోహి అంటూ మాజీ మంత్రి కొండ్రు మురళి, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వైసీపీ సర్కార్ పూర్తిగా దారి మళ్లిస్తోందని అన్నారు. జీవో నెం. 77 తెచ్చి.. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా జగన్ సర్కార్ చేసిందని అన్నారు ఎస్సీ, ఎస్టీలకి ఇచ్చిన డీ పట్టాలను లాక్కుకున్నారని ఆవేదన చెందారు. ఎస్సీ, ఎస్టీలను జగన్ తీవ్రమైన మోసం చేస్తున్నారు. అయినా ఎస్సీ, ఎస్టీ మంత్రులు, వైసీపీ నేతలు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనవర్గాలకు చెందిన 28 పథకాలను తొలగించారని, వాటిని టీడీపీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందని చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి