నిబంధనలకు విరుద్ధంగా ఉందని విశాఖ జిల్లా పెందుర్తిలో... తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి కల్యాణ మండపాన్ని సీజ్ చేశారు. పెందుర్తి సుజాత నగర్లో ఉన్న దాట్ల కన్వెన్షన్ హాల్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. తెదేపా నేతలు కావటంతోనే కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఫంక్షన్ హాల్ యజమాని దాట్ల మధు వాపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు తమపై అనేక రకాలుగా ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు.
పెందుర్తిలో అనేక కల్యాణ మండపాలు నిబంధనలకు విరుద్ధంగా, అనధికారకంగా నిర్మించినప్పటికీ.. అవి వైకాపా నేతలవి కావటంతో వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మధు అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పార్టీ వీడేది లేదని దాట్ల మధు స్పష్టం చేశారు. తమను వేధించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. త్వరలో ప్రజలే వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు.
ఇదీ చదవండి: తెలుగు చిత్ర రంగం మార్పులపై... 'సినిమా హిస్టరీ' డాక్యుమెంటరీ