TDP Cheif Chandrababu will release the India Vision 2047 document tomorrow: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు రామకృష్ణ బీచ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి పామ్‌బీచ్ హోటల్ వరకు (సుమారు 2 కి.మీ. మేర) జాతీయ జెండాతో సమైక్యత పాదయాత్ర ఉంటుందని టీడీపీ నేతలు వెల్లడించారు. అంతేకాకుండా, చంద్రబాబు నాయుడు పర్యటనలో దేశాభివృద్దికి దోహదపడే ఫైవ్ స్ట్రాటజీస్ ఫర్ ఇండియా యాజ్ గ్లోబల్ లీడర్ పేరుతో ‘ఇండియా విజన్-2047’ డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నారని వారు వెల్లడించారు.
Chandrababu Visakha schedule.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారని.. ఆ పార్టీ నేతలు బుద్ద వెంకన్న, పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పర్యటనకు ముందు ఆయన హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.10 గంటలకు విశాఖపట్నం చేరుకుని.. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ర్యాలీలో పాల్గొననున్నారని తెలిపారు. అనంతరం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో, మేధావులతో, యువతతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారని వివరించారు.
The 'India Vision-2047' document release Programme .. ఆ తర్వాత సమావేశంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (జీఎఫ్‌ఎస్‌టీ) స్వచ్ఛంద సంస్థ రూపొందించిన ‘5 స్ట్రేటజీస్ ఫర్ ఇండియా యాజ్ గ్లోబల్ లీడర్’ అనే డాక్యుమెంట్‌ను చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా.. ప్రపంచంలో అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని నిలిపేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై ‘స్ట్రాటజీస్ ఫర్ ఇండియా ఎట్ 100’ పేరుతో జీఎఫ్‌ఎస్‌టీ అధ్యయనం చేయనుందని.. మూడేళ్ల క్రితం ఏర్పడిన ఈ సంస్థకు చంద్రబాబు నాయుడు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. ఇందులో విద్య, వైద్యం, పర్యావరణం, ఆర్థికరంగ నిపుణులు, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ హోదాల్లో పని చేసిన విశ్రాంత ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారని.. మౌలిక సదుపాయాల కల్పన, తయారీ, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్ ఎకో సిస్టమ్, ప్రజారోగ్యం వంటి అంశాలపై జీఎఫ్‌ఎస్‌టీ పని చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలియజేశారు.
రేపు విశాఖకు చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్న సందర్భంగా ఆర్కే బీచ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తాం. ఈ ర్యాలీలో ఎన్టీఆర్, పీవీ నరసింహరావు, పింగళి వెంకయ్యతో పాటు తెలుగు జాతి కోసం కృషి చేసిన వారిని స్మరించుకుంటాం. ఆ తర్వాత ఎంజీఎంలో ఏర్పాటు చేసిన వేదికలో అన్ని వర్గాల వారి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతారు. ఆ తర్వాత ఇండియా విజన్ 2047 గురించి చంద్రబాబు వివరిస్తారు. ఇది టీడీపీ కార్యక్రమం కాదు. ప్రజల కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.-బుద్ద వెంకన్న, పల్లా శ్రీనివాసరావులు, టీడీపీ నేతలు
TDP Chief Chandrababu Fire on CM Jagan: పోలవరంపై మాట తప్పిన జగన్ రెడ్డికి 'జూ' కట్టించాలి: చంద్రబాబు