విశాఖ నగరం గోపాలపట్నంలో గోపాలపట్నం పెట్రోల్ బంకు సమీపంలో పెద్ద శబ్దంతో తాటిపూడి పైప్ లైన్ పగిలింది. బిఎస్ఎన్ఎల్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, బాపూజీ నగర్ ప్రాంతాల్లో నీరు వృథాగా పోయింది. దాదాపు అరగంట ప్రవహించడంతో ప్రజలు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు.
రెండేళ్లలో అనేకసార్లు ఈ విధంగా పైప్ లైన్ పగిలినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: తాండవ జలాశయం నుంచి నీటి విడుదల