విశాఖ జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ కంపోస్టు యార్డు స్థానిక సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. నర్సీపట్నానికి దగ్గరలోని లింగాపురం రహదారి వద్ద నిల్వ ఉంచిన కంపోస్ట్ ను పరిశీలించిన సబ్ కలెక్టర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత కల్పించాలని మునిసిపాలిటీ సిబ్బందిని ఆదేశించారు.అంటురోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, స్థానిక విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: వసతి గృహాలు తెరవాలని విద్యార్థి సంఘాల ఆందోళన