పండగ సెలవులకు విశాఖ నగరంలోని అత్యధికులు స్వగ్రామాలకు, విహారయాత్రలకు వెళ్తుంటారు. చాలా వరకు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లటంతో దొంగతనాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. వీటి నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టమ్(ఎల్.హెచ్.ఎం.ఎస్.)ను సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారు.
సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లే వారంతా సమీపంలోని పోలీసులకు సమాచారం ఇస్తే.. ఆ ఇంటి పరిసరాల్లో నిఘా పెడతామని.. బీట్స్ విధానం కొనసాగిస్తామని డీసీపీ సురేష్‌బాబు వెల్లడించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సురేష్‌బాబు, ఏడీసీపీ వేణుగోపాలనాయుడు, ఏసీపీలు పెంటారావు, శ్రావణ్‌కుమార్‌లతో పాటు నగరంలోని క్రైమ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: