విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన భాజపా జిల్లా కార్యవర్గ సభ్యుడు కే సూర్యనారాయణ రాజు ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. పథకం ప్రకారం పెట్రోల్ పోసి నిప్పుపెట్టారని స్థానికులు భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో తాను అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశానని, ఈ క్రమంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సూర్యనారయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి : కుయ్.. కుయ్.. శబ్ధాలతో మార్మోగిన విజయవాడ