ETV Bharat / state

'ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియామావళి పాటించాలి' - విశాఖపట్నంలో పంచాయతీ ఎన్నికలు

స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నర్సీపట్నం సబ్​కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు. నర్సీపట్నం డివిజన్​కు సంబంధించి 85 అత్యంత సమస్యాత్మక గ్రామాలు గుర్తించినట్లు ఆమె వెల్లడించారు.

మాట్లాడుతున్న సబ్​కలెక్టర్
మాట్లాడుతున్న సబ్​కలెక్టర్
author img

By

Published : Feb 10, 2021, 12:34 PM IST

స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమావళిని విధిగా పాటించాల్సిన అవసరం ఉందని నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. సబ్​కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈనెల 13న జరిగే పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి అవసరమైన సామాగ్రి సిద్ధం చేశామన్నారు.

నర్సీపట్నం డివిజన్​లో పది మండలాలకు సర్పంచ్ అభ్యర్థులు 261 మంది బరిలో ఉండగా వీరిలో 22 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఇంకా 239 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు వెల్లడించారు. వార్డు సభ్యులకు సంబంధించి 2584 మందికి 400 మంది ఏకగ్రీవం కాగా 2184 మంది ఎన్నికల బరిలో ఉన్నారని స్పష్టం చేశారు. నర్సీపట్నం డివిజన్​కి సంబంధించి 72 సమస్యాత్మక గ్రామాలు, 85 అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామన్నారు. 95 మంది రిటర్నింగ్ అధికారులతో పాటు మరో 95 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారని సబ్ కలెక్టర్ వివరించారు.

ఇదీ చదవండి: స్వస్తిక్ గుర్తు లేకపోయినా... ఎన్నికలు జరిగాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.