విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు విశాఖలో భారీ ర్యాలీ చేపట్టాయి. ఉక్కు పరిశ్రమకు స్వంత గనులు లేకపోవడం వల్లే నష్టాల్లోకి వెళ్లిందనేది జగమెరిగిన సత్యమని విద్యార్థులు అన్నారు. అయినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు.
కేవలం నష్టాల పేరుతో విశాఖ ఉక్కు పరిశ్రమను బడా వ్యాపారస్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అమరావతి టూ విశాఖ ర్యాలీ