విశాఖ జిల్లాలో పేదలకు నివాస స్థలాలు ఇచ్చేందుకు ఆరు వేల పైచిలుకు ఎకరాల భూమిని సేకరిచాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై స్పందించిన అధికారులు భూసేకరణపై దృష్టి సారించారు. అందులో భాగంగా సబ్బవరం మండలం ఎరుకనాయుడు పాలెంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని 19 మంది రైతుల నుంచి 65 ఎకరాలను సేకరించారు. డీ పట్టా భూములిచ్చిన రైతులకు ఎకరాకు 900 చదరపు గజాలు, పదేళ్ల నుంచి ఆక్రమణలో ఉంటే 450 చదరపు గజాలు, 5 నుంచి 10 ఏళ్ల మధ్యలో ఆక్రమణలో ఉంటే 250 చదరపు గజాల స్థలం అభివృద్ధి చేసి ఇస్తామని అధికారులు తెలిపారు. భూసేకరణపై స్పందించిన రైతులు పట్టా పుస్తకాల్లో ఎక్కువ భూమి ఉన్నా... జాబితాలో తక్కువ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు చేసుకుంటున్న భూమిని కూడా సాగులో లేనట్లు చూపించినట్లు వాపోయారు.
ఇదీ చదవండి: