విశాఖలో మొదలైన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు - state level youth festival started in visakha by avanthi srinivas
విశాఖలో రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు మొదలయ్యాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ జ్యోతి వెలిగించి ఉత్సవాలు ప్రారంభించారు.13 జిల్లాల నుంచి 500 మంది విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారు లక్నోలో జరిగే జాతీయ యువజనోత్సవాలకు వెళతారని తెలిపారు. దేశభక్తి యువకులందరిలో ఉండాలని మంత్రి అవంతి సూచించారు.