విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన సంభవించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమల్లోనూ యాజమాన్యాలు తీసుకుంటున్న భద్రత చర్యలపై ప్రభుత్వం నివేదికలు కోరింది. ఈ నేపథ్యంలో భీమిలి మండలం చిప్పాడ పంచాయతీలో ఉన్న దివీస్ లేబరేటరీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రంగాలకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం ఇవాళ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.
అపాయకరమైన కెమికల్స్ ఎక్కడ నిలువ చేస్తున్నారు. కెమికల్స్ నిలువ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా ?లేదా ? అనే అంశాలను తనిఖీ బృందం సభ్యులు పరిశీలించారు. తాము నిర్వహించిన తనిఖీలలో అనేక విషయాలను గుర్తించినట్లు ఆంధ్ర విశ్వ విద్యాలయం కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ పి.జె. రావు తెలిపారు. ప్రభుత్వానికి ఈ విషయాలపై పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు వివరించారు.